ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్థలాల మార్కెట్ విలువలపై భారీ వడ్డన

ETV Bharat / videos

Prathidhwani: బాదుడే బాదుడు పథకంలో మరో వడ్డింపు - స్థలాల మార్కెట్ విలువలు పెంపుపై ప్రతిధ్వని

By

Published : May 24, 2023, 9:41 PM IST

Prathidhwani: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సమర్పించు.. బాదుడే బాదుడు పథకంలో మరో వడ్డింపు వచ్చి చేరబోతోంది. సామాన్యుల ఆస్తుల కొనుగోలు కలలను నీరు గార్చేలా జగన్ సర్కార్ భూములు, స్థలాల మార్కెట్ విలువలు భారీగా పెంచేందుకు సిద్ధమయ్యింది. ఇప్పటికే రకారకాల బాదుళ్లతో బెంబేలెత్తుతున్న జనాలకు ఈ సరికొత్త బాదుడు మాట విని గుండెలు అదురుతున్నాయి. అసలు ఈ భూముల బాదుడు ఏమిటి? బాదుళ్ల పథకంలో ఇది ఎన్నవది? రాష్ట్రంలో మరోసారి భూముల మార్కెట్‌విలువ పెంపు తెరపైకి వచ్చింది. కొన్నిచోట్ల 75 నుంచి 100శాతం వరకు కూడా పెంపు ఉండొచ్చంటున్నారు. ఈ ప్రభావం ప్రజలపై ఎలా పడబోతోంది? భూములు, స్థలాల మార్కెట్ విలువ పెంపుతో పెనుభారం అని క్రెడాయ్ కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంది. అయినా సర్కార్ ముందుకే  వెళ్తుంది.  ఆనవాయితీని కూడా పక్కన పెట్టి స్పెషల్ రివిజన్ పేరుతో ఎప్పుడుబడితే అప్పుడు మార్కెట్‌ విలువలు పెంచుతోంది. దీనికో హేతుబద్దత అంటూ ఏమీ లేదు? ఇప్పటికే ఆస్తిపన్ను వీర బాదుడుతో పట్టణప్రాంత ప్రజలు బెంబేలెత్తుతున్న నేపథ్యంలో  ఇదే అంశంపై  నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details