PRATHIDHWANI: ఈసారైనా ఎదురుచూపులకు తెరపడినట్టేనా..? - తాజా ప్రతిధ్వని కార్యక్రమం
PRATHIDWANI: కడప ఉక్కు పరిశ్రమ కోసం నాలుగేళ్లలో ఇదే సీఎం జగన్ 2సార్లు శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపనలు అవుతున్నా.. ఉక్కు పరిశ్రమకు సంబంధించిన అడుగులు మాత్రం పడటం లేదు. ఈసారైనా పూర్తి అవుతుందని బలంగా అనుకోవచ్చా అనే ప్రశ్నలు తలెత్తే పరిస్థితి. గతంలో సైతం 2019 డిసెంబర్‌లో శంకుస్థాపన చేసినప్పుడు సీఎం జగన్.. మూడేళ్లలో పూర్తి చేసి వేలమందికి ఉద్యోగాలిస్తామన్నారు. కానీ, నాటి హామీని నెరవేర్చలేకపోయారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు గాలి జనార్దనరెడ్డిని తీసుకువచ్చి బ్రాహ్మణీ స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. అందులో కనీసం ఒక్క అడుగైనా ఎందుకు పడలేదు. కేంద్రం మీద ఈ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఎందుకు.. సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పెట్టించలేకపోతున్నారు. తాజా శంకుస్థాపనతోనైనా ఎదురుచూపులకు తెరపడినట్టేనా.. అనే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ.