Prathidwani: ఇవాళ రాష్ట్రంలో సగటు ప్రభుత్వ ఉద్యోగి పరిస్థితి ఏమిటి? - ఏపీ ఉద్యోగుల సమస్యల వార్తలు
AP Employees Problems : రాష్ట్రంలో ఉద్యోగులకు ఊరట దక్కేదెప్పుడు? అధికారంలోకి వస్తే నిర్భయంగా పని చేసుకునే స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని వైసీపీ సర్కారు ఎంత మేరకు నెరవేర్చింది? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల మీద దౌర్జన్యాలు పెరిగిపోయాయి.. మేము అధికారంలోకి వస్తే నిర్భయంగా పని చేసుకునే స్నేహ పూర్వక వాతావరణం కల్పిస్తామని వైసీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అది ఎంతవరకు నెరవేరింది? రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో కొద్దిరోజులుగా జరుగుతున్న మథనం ఇదే. వేధింపులు, షోకాజ్ నోటీసులు, నిర్భంధాలు, అరెస్టులు, ఆంక్షల నేపథ్యంలో గతంలో ఒకసారి ‘నీతి లేని ఓ నాయకుడా..! పలుకు లేని పరిపాలకుడా..!' అని జగన్ పాలనపై ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు పాట రాయడం వారి ఆవేదనలకు ఓ ఉదాహరణ మాత్రమే. అసలు ఇవాళ రాష్ట్రంలో సగటు ప్రభుత్వ ఉద్యోగి పరిస్థితి ఏమిటి? ఉద్యోగులు కేంద్రంగా కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఎలా చూడాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.