PRATHIDWANI: వైఎస్ వివేకా హత్య కేసు నిగ్గు తేలేది ఎప్పటికి? - YS VIVEKA MURDER CASE NEWS
గుండెకు స్టంట్స్ వేయించుకుని చికిత్స పొందుతున్న 70 ఏళ్లు పైబడిన పెద్దమనిషి వివేకానంద రెడ్డిని... 2019 మార్చి 15 అర్థరాత్రి కిరాతకంగా హత్యచేశారు కొందరు దుండగులు. వివేకా ఇంటి లోకి ప్రవేశించిన నరహంతకులు ఆయన ముఖంపై పిడిగుద్దులు గుద్ది... గొడ్డలితో విచక్షణారహితంగా నరికారు. రెండు లీటర్ల నెత్తురు ఆయన శరీరం నుంచి ప్రవహించింది. ఆ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వివేకాతో బలవంతంగా... “తన డ్రైవర్ ప్రసాద్ చంపబోయాడని... ఉత్తరం రాయించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు. ఆయనను చంపి రక్తపుటేరులు పారించిన హంతుకులు ఎవరు? వారికి అండగా నిలిచింది ఎవరు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే.. ఏం చేసేవారు? వివేక హత్య వెనుక నిజాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.