PRATHIDWANI: సీఎం సభలంటే ప్రజలెందుకు భయపడుతున్నారు..?
ముఖ్యమంత్రి సభలంటేనే రాష్ట్రంలో జనానికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ.. అది ఏ ప్రాంతమైనా, కార్యక్రమం ఏదైనా... సీఎం, మంత్రుల సభలు అంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. పథకాలు ఆపేస్తామని, రుణాలు నిలిపేస్తామని అధికారులు బెదిరింపులతో తప్పనిసరై వస్తున్న డ్వాక్రా మహిళలు, ఇతర లబ్ధిదారులు.. సీఎం, మంత్రుల ప్రసంగాలు మొదలవగానే పరుగులు తీస్తున్నారు. గేట్లు వేసి అడ్డుకున్నా .. గోడలు, కంచెలు, బ్యారికేడ్లపై నుంచి దూకి మరీ పారిపోతున్నారు. మరోవైపు నిర్భంధాలు, ఆంక్షలు స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సీఎం వెళ్లే దారంతా చెట్ల నరికివేత, పరదాలు, వైసీపీ రంగులు, స్టిక్కర్లు విస్తుబోయేలా చేస్తున్నాయి. భద్రత పేరుతో ప్రజలపై విధిస్తున్న అనేక ఆంక్షలు కూడా విస్తుబోయేలా చేస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, చిన్న వ్యాపారులు.. వీళ్ల గోడు ప్రభుత్వానికి పట్టదా? గతంలో ముఖ్యమంత్రులు ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ఏం చేసేవారు? వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనే పోల్చితే జగన్ పర్యటనల్లో కనిపిస్తున్న వ్యత్యాసం ఏమిటి? అసలు ఎందుకీ పరిస్థితి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.