ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కేంద్రం వద్దంటున్నా, ఆర్బీఐ హెచ్చరిస్తున్నా అప్పులే అప్పులు - ETV Bharat News on AP debts

🎬 Watch Now: Feature Video

etv_bharat_prathidhwani_debate_on_andhra_pradesh_govt

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 10:07 PM IST

Prathidwani: దేశంలో అప్పులు చేయని రాష్ట్రం ఏదైనా ఉందా. మరి ఆంధ్రప్రదేశ్‌ అప్పుల గురించే అందరూ ఎందుకు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేయటానికి కొత్త ఆలోచనలు ఇవ్వండీ అని సీఎం అధికారుల్ని ఎందుకు అడుగుతున్నారు. ప్రతినెలా జీతాలు, పెన్షన్లు సకాలంలో ఎందుకు ఇవ్వట్లేదు. కాంట్రాక్టర్ల బిల్లులు ఎందుకు చెల్లించట్లేదు. గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు జగన్ సర్కార్‌ అప్పులకు తేడా ఏంటి. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి బటన్‌ నొక్కుతూ పోతే ప్రజల భవిష్యత్తు ఏమవుతుంది. పది లక్షల కోట్ల రూపాయలు దాటిన అప్పులెలా తీర్చాలో కనీస అవగాహన రాష్ట్ర అధినేత జగన్‌కు ఉందా. ఇవే అందరి మదిని తొలుస్తున్న ప్రశ్నలు. రాష్ట్ర అప్పులు, చెల్లింపుల మొత్తం భారం పది లక్షల కోట్ల రూపాయలు దాటాయి. ఇది ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుకు ప్రమాదంగా భావించవచ్చా. కేంద్రం వద్దంటున్నా, ఆర్బీఐ హెచ్చరిస్తున్నా జగన్‌ ప్రభుత్వం ఎందుకు బేఖాతరు చేస్తోంది. దీనివల్ల ఎలాంటి భారాలు ప్రజలపై పడే అవకాశం ఉంది. ఇదే అంశం నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details