ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chintala Narayana Interview

ETV Bharat / videos

Chintala Narayana Interview: చంద్రబాబు లోపల ఉన్నా.. ఓట్లు వేసి గెలిపించుకుంటాం: చింతల నారాయణ - ETV Bharat Face to Face with Chintala Narayana

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 9:13 PM IST

Chintala Narayana Interview: వైసీపీ కార్యకర్తలు అడ్డంకులు సృష్టించినా, దాడులు చేసినా బెదిరేది లేదని చంద్రబాబు అభిమాని చింతల నారాయణ తెలిపారు. చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ.. నంద్యాల జిల్లా చిన్నదేవలాపురం గ్రామానికి చెందిన వృద్ధుడు చింతల నారాయణ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. వినుకొండలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో దాడికి గురైన ఆయన.. కోలుకుని మళ్లీ తన యాత్రను పునఃప్రారంభించారు. పాదయాత్రకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అయినా.. చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రి వరకూ పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

తాను పార్టీ రుణం తీర్చుకునేందుకు, చంద్రబాబుపై అభిమానాన్ని చాటుకునేందుకు, భువనమ్మకు సంఘీభావం తెలిపేందుకే.. యాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు. చంద్రబాబుని ప్రసుత్తం జైల్లో పెట్టినా.. సత్యం, ధర్మం, న్యాయం గెలుస్తుందని  నారాయణ తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉన్నా ఆయనను ఓట్లేసి గెలిపించుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వం కక్షతో అరెస్ట్ చేసిందని ఆరోపించారు. తన పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీకి చెందిన కొందరు బెదిరిస్తున్నారని.. అయినా తన యాత్ర ఆగదని తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చేరుకున్న నారాయణకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. నారాయణకు ఆర్థిక సాయం అందించారు. పాదయాత్ర 300 కిలోమీటర్లు దాటిందని, రాజమహేంద్రవరం వరకూ నడుస్తానని.. నారాయణ తెలిపారు. తెలుగుదేశం నేతలు సపోర్ట్​ వల్లే తన పాదయాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details