ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSRCP on Dalith

ETV Bharat / videos

Pratidwani : దళితులకు వైఎస్సార్సీపీ సర్కార్ చేసిందేంటి..? సబ్ ప్లాన్ నిధుల మాటేమిటి..? - హత్యకు గురైన అచ్చెన్న

By

Published : Apr 25, 2023, 9:47 PM IST

Pratidwani : గడిచిన నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలోని దళిత వర్గాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం చేసింది..? ఆత్మగౌరవం, అవకాశాల కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వారికి ప్రతిపక్షంలో ఉండగా.. వైఎస్సార్సీపీ పెద్దలు ఏమని హామీనిచ్చారు. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ.. ఎస్సీలకు ఏమేమి హామీలు ఇచ్చింది? గత నాలుగేళ్లలో ఎన్ని నెరవేర్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్‌ సుధాకర్‌ బాబు ఉదంతం మొదలుకుని కడపలో ఇటీవల హత్యకు గురైన వైద్యుడు అచ్చెన్న ఘటన వరకు జరిగిన పరిణామాల్ని ఎలా అర్థం చేసుకోవాలి. గత నాలుగేళ్లలో దళితుల పట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎలా ఉంది. అధికార పార్టీలో వీటన్నింటిపై కనీసం అంతర్మథనం జరిగిన సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ ప్రయోజనాలను కాపాడుతుందని దళితులు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో ఇప్పుడు ఉందా. రాజకీయంగా దళిత వర్గాల్లో ఇప్పుడు ఎలాంటి చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా అమలు అవుతున్నాయా. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details