Establishment of Vehicle Recycling Hub in Guntur District: కాలం చెల్లిన వాహనాలను రీసైక్లింగ్ హబ్‌లో విక్రయించొచ్చు: డీటీసీ కరీం - ap news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2023, 1:33 PM IST
Establishment of Vehicle Recycling Hub in Guntur District :కాలం చెల్లిన వాహనాలకు సంబంధించి రీసైక్లింగ్ హబ్ దక్షిణ భారత దేశంలో మొదటి సారిగా గుంటూరు జిల్లాలో (South India's 1st Vehicle Scrapping Facility in Guntur) ఏర్పాటైంది. గుంటూరు శివారులోని బుడంపాడు వద్ద హిందూస్తాన్ రీ సైక్లింగ్ హబ్‌కు ప్రభుత్వం అనుమతించినట్లు ఉప రవాణా కమిషనర్ కరీం (Government Approves Hindustan Recycling Hub) తెలిపారు. వాహనదారులు కాలం చెల్లిన, రోడ్లపై తిరగటానికి వీలుకాని వాహనాలను రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ విధానంలో ఇక్కడ విక్రయించవచ్చని చెప్పారు. దానికి సంబంధించి డిపాజిట్ సర్టిఫికెట్ తీసుకుంటే.. వారు కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు ఆ మేరకు రాయితీ పొందవచ్చని వివరించారు. వాహనాల యజమానులు తమ పాత వాహనాలను, కాలుష్యం కలిగించే వాహనాల్ని ఇక్కడ స్క్రాప్ కింద్ అందజేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 16వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు ఈ సౌకర్యం కల్పించినట్లు డీటీసీ కరీం తెలిపారు.