Employees Union Leaders are Unhappy With Govt: సమీక్షలే కాదు.. ఉద్యోగుల సమస్యలపై కూడా చర్చించాలి:ఉద్యోగ సంఘాల నేతలు - Lack of funds for Tahsildar offices
Employees Union Leaders are Unhappy With Govt:రెవెన్యూ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. వారం వారం జరిపే సమీక్షల మీద చూపుతున్న శ్రద్ధ ఉద్యోగులకు కావలసిన నిధులు, కనీస సౌకర్యాలపై చూపాలన్నారు. తహసీల్దారు కార్యాలయాలకు సరిపడా సిబ్బంది లేరు, నిధులు లేవు, కనీస సౌకర్యాలు లేవని తెలిపారు. కొన్ని డివిజన్ కార్యాలయాలలో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందన్నారు. ఒక్కొక్క తహశీల్దార్ కార్యాలయానికి నెలకు 8 రూపాయలు మాత్రమే కార్యాలయ ఖర్చులు ప్రభుత్వం ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె వాహనాలకు నెలకు 35 వేల రూపాయలు వ్యయం అవుతుంటే ప్రభుత్వం ఇచ్చేది 10- 12 వేలు మాత్రమే అన్నారు. రీ –సర్వే కోసం రెవెన్యూ సిబ్బంది లక్షల్లో ఖర్చు పెట్టారు.. కాని బిల్లుల రీ ఎంబర్సుమెంట్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు జిల్లాలకు వస్తె, కనీసం ప్రోటోకాల్ బడ్జెట్ క్రింద ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకుండా ఏం ఖర్చు చేయాలని ప్రశ్నించారు. ఓటర్ల నమోదు, సవరణ, తొలగింపు లాంటి ఎన్నికల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్నారు. పనిభారం, మానసిక, ఆర్థికపరమైన ఒత్తిళ్లతో రెవెన్యూ ఉద్యోగులు సతమతం అవుతున్నారని తెలిపారు.