ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Employees _not_ Received _Salaries

ETV Bharat / videos

Employees not Received Salaries జీతం ఎప్పుడొస్తుందో తెలియక ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆందోళన .. - సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2023, 11:24 AM IST

Employees Not Received Salaries :  రాష్ట్రంలో కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన బిల్లులను.. ప్రభుత్వం ఇప్పటి వరకూ C.F.M.S (సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ)కు అప్‌లోడ్ చేయలేదు. దీంతో నేడు జీతం వస్తుందో రాదో తెలీక ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీలు, ఇతర కారణాల రీత్యా వేతన బిల్లుల అప్ లోడ్ చేయడంలో ఆలస్యమైనట్లు తెలుస్తోంది. పేరోల్‌కు చెందిన బిల్లులు సెప్టెంబరు 1 నుంచి 10 తేదీ మధ్య ఎనేబుల్ అవుతుందంటూ.. వెబ్ ఆప్ లో సమాచారం వస్తోంది. దీంతో ఆగస్టు నెల జీతాలు, పెన్షన్లు సెప్టెంబరు 20 తేదీకైనా వస్తాయో లేదోనని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో జీతాలు పెంచాలని ధర్నాలు చేసే ఉద్యోగులు.. ఇప్పుడు జీతాలు ఇవ్వాలని ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. జీతం కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలో అని ఉద్యోగులు, ఉపాధ్యాయులు అవేదన చెందుతున్నారు. ఫీజులు, ఇంటి అద్దె,  ఈఎంఐలు , ఆసుపత్రి ఖర్చులు, చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రతినెలా ఆలస్యం కారణంగా సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోతే క్రెడిట్‌ స్కోరు తగ్గిపోతుంది. దాంతో బయట ప్రైవేటుగా అప్పులు చేసి ఈఎంఐలు చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details