డిప్యుటేషన్ ఉత్వర్వులను రద్దు చేయాలి - ఎన్నికల అధికారికి ఉద్యోగుల విజ్ఞప్తి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 12:06 PM IST
|Updated : Dec 20, 2023, 1:42 PM IST
Employees Appeal to The Chief Electoral Officer : కేటాయించిన చోటు కాకుండా ఉపాధ్యాయులను డిప్యుటేషన్లపై పంపుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్వర్వులను రద్ధు చేయాలని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. 2024 ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల వివరాలను కోరుతున్న తరుణంలో ఈ డిప్యుటేషన్లు రద్దు చేయాలని ఎంటీఎఫ్ కోరింది. మొత్తం 15 వేల మంది ఉపాధ్యాయులు, ఎన్జీవోల డిప్యుటేషన్ విధుల చిరునామా కాకుండా నియామకం అయిన చిరునామాను ఎన్నికల సంఘానికి ఇవ్వటం నిబంధనలకు విరుద్దమని ఎంటీఎఫ్ తన వినతి పత్రంలో పేర్కొంది. సమాచారం లేక ఉఫాధ్యాయులు, ఉద్యోగులు ఎన్నికల విధులకు హాజరు కాకపోతే ప్రభుత్వం ఇతరులకు విధులు అప్పగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
Appeal of Employees in The Matter of Deputation :డిప్యుటేషన్ కారణంగా ఒక నియోజకవర్గానికి చెందిన ఉద్యోగులను మరో నియోజకవర్గానికి బదిలీ చేయడం వల్ల పోస్టల్ బ్యాలెట్లను సమర్పించే అవకాశం ఉండదని ఎన్నికల ప్రధానాధికారికి విజ్ఞప్తి చేశారు.