ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Elephant Hulchul in Parvathipuram Manyam District

ETV Bharat / videos

Elephant Hulchul in Parvathipuram Manyam District: రైల్వేస్టేషన్​లో ఏనుగు హల్​చల్​.. భయాందోళనలో స్థానికులు - elephant in kothavalasa railway station

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2023, 11:47 AM IST

Elephant Hulchul in Parvathipuram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలసలో అర్ధరాత్రి వేళ ఒంటరి ఏనుగు సంచరించటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఒంటరి ఏనుగు శనివారం రాత్రి సంచరించినట్లు స్థానికులు తెలిపారు. కొత్తవీధి, పెద్దవీధి, మణికంఠ కాలనీ, కొత్తవలస రైల్వే స్టేషన్‌ సమీప ప్రాంతాలలో ఏనుగు సంచరిస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో.. ఇది వైరల్ అవుతోంది. అయితే రాత్రంతా తిరిగిన ఏనుగు తెల్లవారుజామున 3 గంటల వరకు ఏనుగు కొత్తవలసలో ఉందని.. తర్వాత దాని ఆచూకీ కనిపించలేదని స్థానికులు చెప్తున్నారు. 

ఏనుగు సంచారంపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఏనుగు ప్రజల మధ్యకు రాకుండా.. తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై స్పందించిన అధికారులు.. బలిజిపేట మండలం మిర్తివలస నుంచి పార్వతీపురం పట్టణ శివారు ప్రాంతంలో ఏనుగు సంచరిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. అదే విధంగా ఒక్క రాత్రిలో సుమారు 40 కిలోమీటర్లు ఏనుగు ప్రయాణం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details