ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Elephant_Attack_on_Farmer_in_Chittoor_District

ETV Bharat / videos

చిత్తూరు జిల్లాలో రైతుపై ఏనుగు దాడి - వరుస దాడులతో హడలిపోతున్న జనం - చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2023, 10:33 AM IST

Elephant Attack on Farmer in Chittoor District: చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నూలుకుంటలో ఏనుగు దాడి చేయడంతో శిద్దప్ప అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. శిద్దప్ప పొలం వద్ద నుంచి కాలినడకన ఇంటికి వెళ్తుండగా ఏనుగు దాడి చేసింది. గాయపడిన శిద్దప్పను ఆస్పత్రికి తరలించారు. కుప్పం, గుడిపల్లె, వీకోట, బైరెడ్డి పల్లె, పలమనేరు సోమల తదితర మండలాల్లో ఏనుగుల దాడులతో ప్రజలు ఆందోళన తీవ్ర చెందుతున్నారు.

కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లాలోనే ఏనుగులు దాడి చేయటంతో ఓ పశువుల కాపరి మృతి చెందాడు. వరుసగా ఏనుగుల దాడులు చేస్తుడటంతో జనం హడలెత్తిపోతున్నారు. ఈ ఏనుగులు పంటలను సైతం ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల దాడులపై ఇప్పటికే అటవీశాఖ అధికారులకు సైతం సమాచారం ఇచ్చారు. అయినా సరే ఏనుగులు దాడులకు పాల్పడుతుండటంతో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని ఏనుగుల సమస్యను పరిష్కరించాలని చిత్తూరు జిల్లా వాసులు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details