ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Electricity_Workers_Protest_at_DISCOM_Offices

ETV Bharat / videos

Electricity Workers Protest at DISCOM Offices: వేతన ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల నిరసనలు - AP Latest News

By

Published : Aug 10, 2023, 7:08 PM IST

Electricity Workers Protest at DISCOM Offices:రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విద్యుత్‌ ఉద్యోగులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ ఉద్యోగులు చర్చలు జరపగా ప్రభుత్వం విద్యుత్​ ద్యోగులు అడిగిన వాటిలో కొన్నింటికి అంగీకారం తెలిపింది. అందులో​ ఉద్యోగులకు 8 శాతం  ఫిట్ ​మెంట్​, మాస్టర్ స్కేల్ రూ.2.60 లక్షలు ఇవ్వడానికి మాత్రమే ప్రభుత్వం అంగీకరించింది. అయితే వీటిని విద్యుత్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ వేతన ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డిస్కమ్​ల కార్యాలయాల వద్ద ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ ఆందోళనలు చేపట్టారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాకుండా జేఏసీ రాజీ పడిందంటూ ఆక్షేపణ వ్యక్తం చేసింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్ల మనోవేదన అర్ధం చేసుకోకుండా ఏం పీఆర్సీ సాధించారంటూ విద్యుత్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులు, జూనియర్ లైన్ మెన్ గ్రేడ్ 2ల సమస్యలు పరిష్కారం కాకపోవటంపై విద్యుత్ జేఏసి నుంచి వివిధ సంఘాలు వైదొలుగుతున్నాయి. వివిధ డివిజన్లు, సర్కిల్ కార్యాలయాల వద్ద జేఏసీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు నినాదాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details