Electricity Employees On Strike in AP సమ్మె బాటలో విద్యుత్తు ఉద్యోగులు.. సమ్మె నోటీసుకు సిద్దమైన జేఏసీ - AP TOP NEWS TODAY
Electricity Workers On Strike : విద్యుత్తు ఉద్యోగులు సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు. యాజమాన్యంతో జరిగిన ఉద్యోగుల చర్చలు విఫలం కావడంతో.. విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలు సమావేశం అయ్యింది. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని డిమాండ్ల సాధనకు సమ్మె ఒక్కటే మార్గమని.. మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. యాజమాన్యానికి 14 రోజుల సమ్మె నోటీసు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఉద్యోగుల వేతన సవరణ, అలవెన్సుల చెల్లింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ డిమాండ్లను పరిష్కరించడంపై యాజమాన్యం చాలాకాలంగా నిర్ణయం తీసుకోకపోవడంతో... నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేతన సవరణ ఒప్పందం ప్రకారం 2022 ఏప్రిల్ నుంచి సింగిల్ మాస్టర్ స్కేల్ అమలు చేస్తామని, ఒప్పందం నాటుగు సంవత్సరాలు అమల్లో ఉంటుందని యాజమాన్యం ప్రతిపాదించింది. గరిష్ఠ మాస్టర్ స్కేల్, గరిష్ఠ కేడర్ స్కేల్‌లపై వచ్చిన ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. విద్యుత్తు సిబ్బందికి 2022 ఏప్రిల్ నుంచి పీఆర్‌సీ అమలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఒప్పంద ఉద్యోగులకు సంస్థ నుంచి నేరుగా జీతాలు చెల్లించాలని....1999-2004 మధ్య విధుల్లో చేరిన సిబ్బందికి పాత పింఛను విధానాన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు.