ఆంధ్రప్రదేశ్

andhra pradesh

electricity_short_circuit

ETV Bharat / videos

ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్, పేలిన గ్యాస్ సిలిండర్ - ఎక్కడంటే? - గుత్తి మండలం విద్యుత్ షార్ట్ సర్క్యూట్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2023, 12:48 PM IST

Electricity Short Circuit in Anantapur District: అనంతపురం జిల్లాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో ఓ ఇంట్లో లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగింది. గుత్తి మండలం ఎస్ ఎస్ పల్లి గ్రామంలోని దుర్గమ్మ గుడి సమీపంలోని.. లక్ష్మీదేవి అనే మహిళ ఇంట్లో ఈ సంఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్​తో పాటు గ్యాస్ సిలిండర్ పేలి.. మంటల తీవ్రతను పెంచింది. ఇంట్లోలోని ఎలక్ట్రికల్ వస్తువులతో పాటు నిత్యావసర సరకులు మంటల్లో కాలిపోయాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ సంఘటన జరిగింది. 

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది.. సంఘటన స్థలానికి చేరుకొని ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. లక్ష్మీదేవి దంపతుల ఫిర్యాదు మేరకు.. పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరగడం వల్ల.. బాధితులు కన్నీరు మున్నీరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details