Prathidhwani పంచాయతీ నిధులపై విషయంలో ప్రభుత్వ తీరుపై సర్పంచ్‌ల ఆందోళన - prathidhwani in youtube
వైసీపీ ప్రభుత్వం ఊరి సొమ్ముల్ని కూడా వదల్లేదు..! గత కొన్ని నెలలుగా నిధుల మళ్లింపు వివాదం కొనసాగుతోంది. పంచాయతీ నిధుల విషయంపై సర్పంచ్‌ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా రూ.8,500కోట్లకు పైగానే బకాయిలు అంటూ సర్పంచులు ఆరోపిస్తున్నారు. అంత భారీమొత్తంలో పంచాయతీల నిధులు ఎటు వెళ్లాయి.. సర్పంచ్‌లకు తెలియకుండానే ఖాతాలు ఖాళీ అయితే ఇందుకు చట్టం, నిబంధనలు అంగీకరిస్తున్నాయా? ఆయా పంచాయతీల్లో రోజు వారీ నిర్వహణ కోసం డబ్బులు ఎలా వస్తాయి. ఖాతాల్లో పైసా లేకుంటే అభివృద్ధి కార్యక్రమాల మాటేంటి.. నిధులమళ్లింపుపై ఘాటుగానే గళం వినిపిస్తున్న సర్పంచ్‌లు తమకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరికి మొరపెట్టుకోవాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో.. పంచాయతీరాజ్ వ్యవస్థ మనుగడ సాగించాలంటే, సర్పంచ్ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలంటే ఏం చేయాలి అనే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST