ఆంధ్రప్రదేశ్

andhra pradesh

_e-office_version_up_grade_works

ETV Bharat / videos

E Office version up grade works ప్రభుత్వ కార్యాలయాల్లో నిలిచిన ఫైళ్ల క్లియరెన్స్.. ఈ ఆఫీస్ వెర్షన్ అప్ గ్రేడ్​లో భాగమన్న సర్కార్ - E Office version

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2023, 5:43 PM IST

E Office version up grade works  రాష్ట్ర ప్రభుత్వం రెండు దశలుగా ఈ ఆఫీస్ వెర్షన్ ను అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ఈ ఆఫీస్ అప్​ గ్రేడ్ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో నిలిచిపోయింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు ఈ-ఆఫీస్ వ్యవస్థ పని చేయదు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సంస్థ వెర్షన్ మారుస్తుండడం తో ఈ-ఆఫీస్ పని చేయడం లేదు. 
ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ చేస్తుండడంతో సచివాలయం సహా రాష్ట్ర వ్యాప్తంగా ఈ-ఆఫీస్ వ్యవస్థ లోని దస్త్రాలు నిలిచిపోనున్నాయి. రెండు దశలుగా ఈ ఆఫీస్ వెర్షన్ ను అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించగా.. ప్రస్తుతం ఉన్న 5.6 వెర్షన్ నుంచి 7.xకు ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ కానుంది. ఈ ఆఫీస్ వ్యవస్థ ఆగిపోవడంతో సచివాలయం సహా రాష్ట్ర వ్యాప్తంగా దస్త్రాలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ వ్యవస్థ నిలిచిపోయింది. శని, ఆదివారాల్లో ఈ- ఆఫీస్‌ అప్ గ్రేడ్ పనులు పూర్తి చేసుకుని సోమవారం ఉదయం 6గంటల తర్వాత పనిచేయనుంది.

ABOUT THE AUTHOR

...view details