ఆంధ్రప్రదేశ్

andhra pradesh

chandrababu_bail_petition

ETV Bharat / videos

Dussehra Vacation Special Bench to Hear Chandrababu Bail Petition: బెయిల్​పై అత్యవసర విచారణ జరపాలని.. చంద్రబాబు హౌస్​ మోషన్​ పిటిషన్​ - AP Latest News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2023, 11:48 AM IST

Updated : Oct 26, 2023, 2:23 PM IST

Dussehra Vacation Special Bench to Hear Chandrababu Bail Petition: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ అనుబంధ పిటిషన్లపై(Chandrababu Bail Petition) దసరా సెలవుల ప్రత్యేక బెంచ్‌ రేపు విచారణ జరపనుంది. జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్‌ ముందు 8వ కేసుగా బెయిల్‌ అభ్యర్థన.. విచారణ జాబితాలోకి వచ్చింది. స్కిల్‌ కేసులో ఏసీబీ కోర్టు (ACB Court) బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో.. చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 19న హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి.. వెకేషన్‌ బెంచ్‌ ముందుకు వాయిదా వేసింది. చంద్రబాబు వైద్య నివేదికలను రేపటి విచారణ కోసం కోర్టు ముందు ఉంచాలని రాజ మహేంద్రవరం జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది.

ACB Court Hearing on CID Call Data:చంద్రబాబు అరెస్టు సమయంలో సీఐడీ కాల్‌డేటా అంశంపై నేడు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. సీఐడీ అధికారుల కాల్‌డేటా భద్రపరచాలని కోరుతూ చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  ఇప్పటికే ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు సీఐడీని ఏసీబీ ఆదేశించగా.. సీఐడీ తరపు న్యాయవాదులు కౌంటర్​ పిటిషన్​ దాఖలు చేశారు. కేసు విచారణను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. 

House Motion Petition Filed in High Court: బెయిల్ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని హైకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఎడమ కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ 3 నెలల క్రితం జరిగిందని.. ఇప్పుడు కుడి కంటికి కూడా ఆపరేషన్ జరపాల్సి ఉందని న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. 

Last Updated : Oct 26, 2023, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details