Dussehra Navratri Celebrations 2023: కోనసీమ జిల్లాలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి 58రకాల పిండి వంటలతో సారె.. - అంబాజీ పేట లేటెస్ట్ న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 22, 2023, 2:47 PM IST
Dussehra Navratri Celebrations 2023: రాష్ట్ర వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా.. పలు ఆలయాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకు మెుక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. దుర్గాష్ఠామిన దుర్గాదేవిని దర్శించుకుంటే దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కోనసిమ జిల్లా అంబాజీపేటలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి 58 రకాల పిండి వంటల సారెను సమర్పించారు. ముంగండ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో.. గణపతి ఆలయం నుంచి వాసవిమాత ఆలయం వరకు.. స్థానిక పురవీధుల్లో అమ్మవారి సారెతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా రేపటితో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.