ఆంధ్రప్రదేశ్

andhra pradesh

dussehra_celebrations

ETV Bharat / videos

Dussehra Celebrations Begins at Kanakadurgamma Temple రేపటి నుంచే కనకదుర్గమ్మ దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలు.. - Dussehra celebrations in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2023, 9:38 PM IST

Dussehra Celebrations to Begin at Kanakadurgamma Temple:విజయవాడలో ప్రతీ ఏటా ఘనంగా జరుపుకునే దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది.    ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ (Indrakiladri Kanakadurgamma) ఆలయంలో రేపటి నుంచి దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలు (Dussehra celebrations) ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 వరకు దసరా‌ మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనక దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. తొలి రోజు బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. దసరా ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. వినాయకుని గుడి నుంచి దుర్గమ్మ సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేయనున్నామని ఆలయ ఈవో కె.ఎస్‌. రామారావు తెలిపారు. రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌నజీర్‌ (Governor Justice Abdulnazeer) అమ్మవారి తొలి దర్శనానికి రానున్నారు. ఉత్సవ ఏర్పాట్లపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో కె.ఎస్‌.రామారావుతో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details