ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Durga_Gudi_Governing_Body_Approves_Key_Decisions

ETV Bharat / videos

Durga Temple Governing Body Key Decisions: భక్తులకు ప్యాకెట్ల రూపంలో కుంకుమ ప్రసాదం.. దుర్గగుడి పాలక మండలి కీలక నిర్ణయాలు - ఏపీ దేవాలయాల వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2023, 7:34 PM IST

Durga Temple Governing Body Key Decisions: బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు కంకుమ ప్రసాదం ఇచ్చేందుకు దుర్గగుడి పాలక మండలి సిద్ధమైంది. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కుంకుమ ప్రసాదాన్ని ప్యాకెట్ల రూపంలో శ్రావణ పౌర్ణమి నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని పాలక మండలి చైర్మన్ ప్రకటించారు. చైర్మన్ కర్నాటి రాంబాబు అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 32 అంశాల గురించి చర్చించి ఆమోదం తెలిపినట్లు పాలక మండలి చైర్మన్ తెలిపారు. 

ఈ సమావేశంలో తీసుకున్న కీలక అంశాలు.. వృద్ధులు, వికలాంగులను అమ్మవారి ఆలయం వద్దకు చేరవేసేందుకు డీజిల్‌తో నడిచే వాహనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. దూరప్రాంతాల నుంచి విచ్చేసే వారితోపాటు అమ్మవారి సన్నిధిలో నిద్ర చేయాలని భావించే వారి కోసం మహామండపం ఒకటో అంతస్తులో డార్మిటరీని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 2016లో మూసివేసిన మల్లిఖార్జున మెట్ల మార్గాన్ని తిరిగి ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. దేవస్థానం తరఫున ప్రత్యేక ఛానల్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అమ్మవారి ఆలయ విశిష్టతను, ఇంద్రకీలాద్రి వైభవాన్ని తెలిపే డాక్యుమెంటరీ రూపకల్పనకు ఆమోదం తెలిపామన్నారు.

ABOUT THE AUTHOR

...view details