High temperatures in the state : వడదెబ్బ అంటే తెలుసా..? ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే..! - మిట్ట మధ్యాహ్నం ఎండలు
High temperatures are being recorded in the state : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి సెగలకు అల్లాడిపోతున్న జనం.. ఎండ నుంచి ఉపశమనం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. రోజురోజుకు ఎండ తీవ్రత భారీగా పెరగడంతో బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఇక మిట్ట మధ్యాహ్నం ఎండలు మరింత మండిపోతున్నాయి. వృద్ధులు, కూలీలు ఎక్కువగా వడదెబ్బకు గురవుతున్నారు. అసలు వడదెబ్బ అంటే ఏమిటి..? లక్షణాలు ఎలా ఉంటాయి..? ఏఏ అవయవాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందో తెలుసా..?
ఎండతీవ్రత పెరగటంతో వడదెబ్బ తాకిడికి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. గత కొన్ని రోజులుగా 45, 46 డిగ్రీలు నమోదవుతున్నాయి. మరోవైపు రోహిణీ కార్తె దగ్గరపడుతోంది. ఈ కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని నానుడి కూడా ఉంది. రోహిణి కార్తె రాకముందే అధిక ఉష్ణోగ్రతలు నమోదవటంపై వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శరీరానికి అవసరమైన నీటిని తీసుకోకపోతే డీ హైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదముందని చెబుతున్నారు. ఎక్కువ సేపు ఎండలో ప్రయాణిస్తే వడదెబ్బ తగిలే అవకాశముందని.. లవణాలు ఉన్న నీటిని తాగితే డీహైడ్రేషన్ నుంచి రక్షణ పొందవచ్చని చెబుతున్న వైద్య నిపుణులతో మాప్రతినిధి ముఖాముఖి.