ఆంధ్రప్రదేశ్

andhra pradesh

DSC-1998 Candidates Agitation

ETV Bharat / videos

DSC 1998 Candidates Agitation: డీఎస్సీ-1998 బ్యాచ్ అభ్యర్థుల ఆందోళన.. అర్హులందరికీ ఉద్యోగాలివ్వాలని డిమాండ్ - We waited 25 years APs DSC 98 candidates

By

Published : Aug 16, 2023, 3:28 PM IST

Updated : Aug 16, 2023, 3:57 PM IST

DSC-1998 Candidates Agitation in Vijayawada Dharna Chowk :డీఎస్సీ 1998 అభ్యర్థులకు మానవతా కోణంలో ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి జీవోలో పేర్కొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వడంలో మాత్రం మానవత్వం  చూపలేదని డీఎస్సీ 1998 అభ్యర్థులు అన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులందరికీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్​లో డీఎస్సీ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. ఎంపిక సమయంలో 7 వేల మంది అభ్యర్థులకు పైగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి.. అందులో కేవలం 4 వేల 72 మందికి మాత్రమే పోస్టులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని వారు మండిపడ్డారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ పాటించలేదని, కొన్ని జిల్లాల్లో ఒక అభ్యర్థికి కూడా ఉద్యోగం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంతో.. ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా డీఎస్సీ 1998 అభ్యర్థులందరికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డీఎస్సీ అభ్యర్థులు హెచ్చరించారు.

Last Updated : Aug 16, 2023, 3:57 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details