ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Drugs_Seized_in_Guntakal_and_Two_Persons_Arrested

ETV Bharat / videos

Drugs Seized in Guntakal and Two Persons Arrested: అనంత జిల్లాలో డ్రగ్స్​ కలకలం.. గోవా నుంచి హైదరాబాద్​కు తరలిస్తుండగా ఇద్దరు అరెస్ట్​ - drugs caught by police

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2023, 8:03 PM IST

Drugs Seized in Guntakal and Two Persons Arrested:అనంతపురం జిల్లాలో నిషేధిత మాదక ద్రవ్యాలు కలకలం సృష్టించాయి. వాటిని సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తులని పోలీసులు వెల్లడించారు. వీరు ఉద్యోగ అన్వేషణలో హైదరాబాద్​కు వెళ్లగా అక్కడ పరిచయమైన వ్యక్తితో.. డ్రగ్స్​ సరఫరా రంగంలోకి దిగినట్లు పోలీసులు వివరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దయాకర్​బాబు, వివేక్​లు గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసుకున్నారు. ఉద్యోగ వేటలో హెదరాబాద్​ వెళ్లారు. అక్కడ వారు డ్రగ్స్​కు అలవాటయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్​కు చెందిన వ్యక్తితో వారికి పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గోవా నుంచి డ్రగ్స్​ తీసుకువచ్చి తనకు అందిస్తే వారికి కావాల్సిన డ్రగ్స్​ అందిస్తానని తెలిపాడు. దీంతో వారు దానికి సరే అని గోవాకు వెళ్లారు. గోవా నుంచి తిరిగి వస్తున్న క్రమంలో గుంతకల్లు వరకు రైలు మార్గంలో అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్​ వచ్చేందుకు సిద్ధమయ్యారు. రహదారిపై వాహనం కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. పక్క సమాచారంతో పోలీసులు వీరిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 13 గ్రాముల నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు వివరించారు. నిషేధిత మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించనున్నట్లు వివరించారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details