ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తిరుమలలో డ్రోన్ కలకలం - మరోసారి బయటపడిన నిఘా వైఫల్యం - Tirumala Drone visuals

🎬 Watch Now: Feature Video

drone_in_tirumala.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2024, 6:03 PM IST

Drone Camera Used Illegally in Tirumala:తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం బయటపడింది. టీడీపీ విజిలెన్స్ అధికారుల కళ్లు కప్పి నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో స్వామివారి దర్శనానికి వచ్చిన ఇద్దరు భక్తులు తిరుమల కొండలను వీడియో తీశారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో 53వ మలుపు వద్ద డ్రోన్ కెమెరా ఎగురవేసి కొండలను వీడియో చిత్రీకరణ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా తిరుమల డ్రోన్​ తీసుకురావడం నిషేధం ఉంది. భక్తుల వాహనాలను అలిపిరి చెక్‌పోస్టు వద్ద పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తారు. అయినప్పటికీ తనిఖీలను దాటుకొని వారు డ్రోన్ తీసుకొచ్చి దాన్ని వినియోగించడం కలకలం రేపింది.

 ఈ క్రమంలో మరోసారి భద్రత విషయంలో టీటీడీ విజిలెన్స్ వైఫల్యం చెందింది. ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు భద్రత సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన విజిలెన్స్ అధికారులు అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరా ఎగరవేసిన భక్తులు అస్సాం రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details