Drinking Water Workers Protest: సమ్మెబాటలో కార్మికులు.. నీటి పంపింగ్ కేంద్రంలో మోటార్లు బంద్.. - నీటి పంపింగ్ కేంద్రంలో మోటార్లు బంద్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 8, 2023, 1:38 PM IST
Drinking Water Workers Protest: అనంతపురం జిల్లా కూడేరు మండలంలో వేతనాలు, పీఎఫ్ సాధన కోసం.. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు చేపట్టిన సమ్మె మళ్లీ ఉద్ధృతమైంది. గత నెల 19 నుంచి 29వ తేదీ వరకు పది రోజులపాటు కార్మికులు నీరవధిక సమ్మె చేపట్టారు. దీనిలో భాగంగా గత నెల 29న కార్మికులతో.. అధికారులు, గుత్తేదారులు ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ ఒప్పందం ప్రకారం తమకు వేతనాలు చెల్లించకపోవడంతో.. సీఐటీయూ కార్మిక సంఘం నాయకులు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగినట్లు వారు తెలిపారు. పీఏబీఆర్ వద్ద ఉన్న నీటి పంపింగ్ కేంద్రంలో కార్మికులు మోటార్లు బంద్ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 850 గ్రామాలతో పాటు ఐదు మున్సిపాలిటీలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. మరో మూడు నెలల వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తుండటంతో సమ్మెకు దిగినట్లు వారు పేర్కొన్నారు. తమ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు.