ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Doliphin_ Dead_ Body_ came to_ Uppada_ Coast

ETV Bharat / videos

Doliphin Dead Body came to Uppada Coast : ఉప్పాడ తీరానికి కొట్టుకొచ్చిన భారీ డాల్ఫిన్ - Fisheries Officer

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2023, 11:29 AM IST

Doliphin Dead Body came to Uppada Coast :పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యానికి తోడు.. ఇతర వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి. వీటితో పాటు సముద్రపు నీళ్లలో ప్లాస్టిక్ పేరుకుపోయి జీవవైవిధ్యం దెబ్బతింటోంది. దీనివల్ల సముద్రంలో నివసించే చేపలు, రొయ్యలు, పీతలు వంటివి మృత్యువాత పడుతున్నాయి. ఇదే క్రమంలోకాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరానికి మృత్యువాత పడిన భారీ డాల్ఫిన్ కొట్టుకొచింది. ఉప్పాడ బీచ్ రోడ్ శివారు సబ్బంపేట సమీపంలో తీరం వెంబడి సుమారు 150 కిలోల డాల్ఫిన్ మృత్యువాత పడి ఉండడం గుర్తించిన స్థానికులు మత్స్య శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న మత్స్యశాఖ అధికారులు చనిపోయిన డాల్ఫిన్​ను పరిశీలించి పంచనామా కోసం ల్యాబ్​కి తరలించారు. పంచనామా అనంతరం ఖననం చేస్తామని మత్స్యశాఖ అధికారి శ్రీరామకృష్ణ తెలిపారు. డాల్ఫిన్ తీరానికి వచ్చిందని తెలుసుకున్న సందర్శకులు చూడడానికి పోటెత్తారు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన సమయంలో ఇది మరణించి ఉందని అక్కడి మత్య్సకారులు తెలిపారు. దీంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ కాలుష్యంపై ప్రజల్లో చైతన్యం రావాలని కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details