ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Dogs_Attack_on_Several_People_in_Pedanandipadu

ETV Bharat / videos

Dogs Attack on Several People in Pedanandipadu: గుంటూరు జిల్లాలో పిచ్చి కుక్కల స్వైరవిహారం.. 8మందిపై దాడి - పెదనందిపాడు లోకల్ వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 2:10 PM IST

Dogs Attack on Several People in Pedanandipadu: గుంటూరు జిల్లా పెదనందిపాడులో పిచ్చి కుక్కలు రెచ్చిపోయాయి. ఎనిమిది మందిపై  పిచ్చి కుక్కలు దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఎక్కడి నుంచో రోడ్డుపైకి వచ్చిన కుక్కలు.. ఆ రహదారి మీద వెళ్తున్న వారి పై అకస్మాత్తుగా దాడికి దిగాయి. పక్కనే ఉన్న పశువుల పై కూడా కుక్కలు దాడి  చేశాయి. కుక్కల దాడిలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం.. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మధ్య కాలంలో పెదనందిపాడు గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా అయిందని స్థానికులు తెలిపారు. కుక్కల నియంత్రణ విషయంలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికి పలుమార్లు అధికారులకు విన్నవించినా.. వారు  సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కుక్కల సమస్యపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details