బీడు భూముల్లో బాంబు కలకలం - పేలి కుక్క మృతి - A dog killed by a bomb
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2023, 10:48 PM IST
Dog Dies to Bomb Blast in Prakasam District :ప్రకాశం జిల్లాలోని బీడు భూముల్లో బాంబు కలకలం రేపింది. జిల్లాలోని దర్శి మండలం బండి వెలిగండ్ల గ్రామ పంచాయితీలోని గంగపాలెం శివారులో ఉన్న బీడు భూముల్లో బాంబు పేలి అలజడి చెలరేగింది. రోజువారి విధుల్లో భాగంగా గంగపాలెం గ్రామానికి చెందిన పశువుల కాపరి.. పుల్లారెడ్డి పశువుల తోలుకొని పొలం వెళ్లాడు. తన పెంపుడు కుక్క కూడా తనతో పాటు వెళ్లింది. తన కుక్క అటు ఇటు తిరుగుతూ ముళ్ల చెట్టు కింద వాసన పసిగట్టి అక్కడికి వెళ్లింది.
అక్కడ ఉన్న బంతి ఆకారపు బంబుని నోటితో కొరకగా ఒక్క సారిగా.. పెద్ద శబ్దంతో పేలింది. ఈ ఘటనలో కుక్క అక్కడికక్కడే చనిపోయింది. ఘటన స్థలానికి కొద్ది దూరంలో ఉన్న పుల్లారెడ్డి భయాందోళనకు గురై హూటాహూటిన ఘటనా స్థలానికి వెళ్లి చూడగా కుక్క నోరు చీలిపోయి చనిపోయి ఉండడానికి గ్రహించాడు. అడవి పందులను వేటాడే కొందరు వ్యక్తులు వాటి కోసం ఈ పేలుడు పదార్థాలను అమర్చి ఉంటారని పుల్లారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.