ఆంధ్రప్రదేశ్

andhra pradesh

subrahmanyam_murder_case

ETV Bharat / videos

సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్‌ - తోసిపుచ్చిన డివిజన్‌ బెంచ్‌ - Ananta Babu driver murder case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 6:47 PM IST

Division Bench Dismissed Driver Subrahmanyam Parents Petition: దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను (Dalit youth Subrahmanyam murder case) వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (YCP MLC Anantha Babu) అతి కిరాతకంగా హత్య చేసిన కేసు హైకోర్టులో విచారణ జరిగింది. హత్య కేసును సీబీఐకీ అప్పగించాలంటూ మృతుడి తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌పై డివిజన్ బెంచ్ విచారణ జరపగా ఆ పిటీషన్​ను డివిజన్‌ బెంచ్‌ తోసిపుచ్చింది. రాష్ట్ర పోలీసుల విచారణతో న్యాయం జరగదంటూ తల్లిదండ్రుల పిటిషన్‌ వేయడం జరిగింది. 

గతంలో విచారణ జరిపి సీబీఐ విచారణ అవసరం లేదని సింగిల్‌ జడ్జి స్పష్టం చేశారు. నెల రోజుల్లో నిందితులపై ఛార్జిషీట్‌ దాఖలుకు గతంలో ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై ధర్మాసనానికి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు అప్పీల్ చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులు కరెక్టేనంటూ తల్లిదండ్రుల అప్పీల్‌ను డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. 

ABOUT THE AUTHOR

...view details