Priya Foods celebrates Mother's Day మాతృ దినోత్సవం సందర్భంగా కన్న తల్లులకు 'ప్రియ'మైన కానుక - విజయవాడ మెటర్నిటీ హాస్పిటల్
Priya Foods celebrates Mother's Day అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రియ ఫుడ్స్ ఆధ్వర్యంలో విజయవాడ మాతాశిశు ఆసుపత్రిలో గిఫ్ట్‌హ్యాంపర్స్ అందజేశారు. 13వ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన దగ్గరి నుంచి 14వ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల మధ్య ఆసుపత్రులో నవజాత శిశువులకు జన్మనిచ్చిన తల్లులకు ప్రత్యేక కిట్‌ను పంపిణీ చేశారు. సామాజిక బాధ్యతగా సీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా ఈ కిట్‌లను అందించారు. శిశువులకు, తల్లులకు అవసరమౌన పౌష్టికాహారం, ఇతర వస్తువులను ఈ కిట్‌లలో సమకూర్చారు. మాతాశిశు ఆసుపత్రి ఆర్‌ఎంఓ నాగేశ్వరరావు, ఈనాడు విజయవాడ యూనిట్ మేనేజరు సీహెచ్.కె.కిషోర్‌కుమార్, ఆసుపత్రి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు అంతర్జాతీయ మాతృదినోత్సవ ప్రాధాన్యాన్ని వివరించారు. అమ్మ పునర్జన్మ ఎత్తి శిశువుకు జన్మనిస్తుందని... పొత్తిళ్లలో పసికొందును చూసి ప్రసవ వేదన మరిచిపోతుందని... మాతృమూర్తులకు అభినందనలు తెలిపారు. కనిపెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తు తెచ్చుకోవడం కోసం ప్రతి ఏడాది మే నెలలో రెండో ఆదివారం మదర్స్‌డేగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుతున్నారని తెలిపారు. నవమాసాలు మోసి... కంటికి రెప్పగా చూసుకుని... ఎంతో జాగ్రత్తగా పెంచి ప్రయోజకులను చేసే తల్లులను ఎల్లప్పుడూ గౌరవించాలని... వారిని అనునిత్యం పూజించాలని అన్నారు. అమ్మంటే కదిలే దేవత అందుకే తల్లిని దేవతగా ఆరాధించాలని తెలిపారు.