ఆంధ్రప్రదేశ్

andhra pradesh

incharges_in_ycp

ETV Bharat / videos

పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తిని సమన్వయకర్తగా ఎలా నియమిస్తారు : వైఎస్సార్​సీపీ నేతలు - Class war in YCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2024, 1:59 PM IST

Dissatisfaction over Change of Incharges in YSRCP:వైఎస్సార్సీపీలో ఇంఛార్జ్‌ల మార్పులతో అసమ్మతి సెగ రేగింది. ఇన్నాళ్లూ పార్టీ కోసం పని చేస్తే ఇప్పుడు కొత్తవారిని తీసుకువచ్చి సమన్వయకర్తలు అంటే సరేనంటూ తలలు ఊపేయాలా? అంటూ నేతలు అంతర్గత భేటీల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నేతలు తమ వర్గీయులతో సమావేశాలు పెట్టించి నిరసన వ్యక్తం చేయిస్తున్నారు. మరికొందరి వర్గీయులైతే తమ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా నియమించిన మాచాని వెంకటేష్​కు పార్టీ సభ్యత్వం లేదని ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు మండిపడ్డారు. ఎమ్మిగనూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీలు, సర్పంచ్​లు, ఎంపీటీసీలు సమావేశమై మీడియాతో మాట్లాడారు. పార్టీలో ఎలాంటి గుర్తింపు లేని వారిని అధినాయకత్వం సమన్వయకర్తగా నియమించడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి లేదా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వేలు అన్ని బోగస్ అని కొట్టిపారేశారు.

ABOUT THE AUTHOR

...view details