Dispute in Guntur AC Law College Principal Post: దాడికి దారి తీసిన ఏసీ న్యాయకళాశాల ప్రిన్సిపాల్ పదవి.. - Guravaya group attack on Amrita Varshini
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 26, 2023, 10:38 PM IST
Dispute in Guntur AC Law College Principal Post : గుంటూరులోని ఏసీ న్యాయకళాశాల ప్రిన్సిపాల్ పదవి అంశంలో తలెత్తిన వివాదం దాడులకు దారి తీసింది. ప్రిన్సిపాల్ బాధ్యతలను ఎవరు చేపట్టాలనే విషయంలో రెండు వర్గాల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఇదే అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. గురవయ్యను ప్రిన్సిపాల్‌గా కొనసాగాలని సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు. అయితే గురవయ్య నియామకం చెల్లదని వైస్ ప్రిన్సిపాల్ అమృత వర్షిణి కోర్టును ఆశ్రయించారు. ప్రిన్సిపాల్‌గా గురవయ్య కొనసాగటం సరికాదని హైకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. అమృత వర్షిణికి అనుకూలంగా ఆదేశాలు జారి చేసింది. హైకోర్టు బెంచ్ ఆదేశాలతో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన అమృత వర్షిణిపై గురవయ్య వర్గం దాడికి దిగింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. దాంతో ఆమె జీజీహెచ్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. అనంతరం తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరులోని క్రైస్తవ సంస్థ ఏఈఎల్సీ ఆస్తుల విషయంలో కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. ఏసీ కళాశాల కూడా ఈ పరిధిలోకే వస్తుంది. రెండు వర్గాలుగా విడిపోయి తరచుగా వివాదాలకు చోటిస్తున్నారు.