ఆ ప్రాంతాలు అభివృద్ది చేస్తే.. ఏపీలో సినిమా షూటింగ్‌లు: రాఘవేంద్రరావు - cinema industry development in Andhra Pradesh
DIRECTOR K RAGHAVENDRA RAO : ఆంధ్రప్రదేశ్లో షూటింగ్‌లు జరిపేందుకు మౌలిక వసతులు కల్పిస్తే.. సినీ రంగం అభివృద్ధి చెందుతుందని ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని సాయిబాబా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవేంద్రరావుని ఆలయ నిర్వాహకులు పాతూరి నాగభూషణం శాలువాతో సత్కరించారు. పక్కనే ఉన్న గోశాలలో గోవులకు పూజలు చేసి.. ఆహారం తినిపించారు. వచ్చే ఎన్నికల్లో మంచి వ్యక్తులు గెలుస్తారని.. రాష్ట్రాన్ని మంచిగా పాలిస్తారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ది చేస్తే ఇంకా ఎక్కువ సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా చిన్న సినిమాలను తీయాలనుకునే వారికి వైజాగ్ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. తన శిష్యులకు ఆస్కార్ రావటం సంతోషంగా ఉందని పునరుద్ఘాటించారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రాబోయే చిత్రం ఒక తరం మొత్తం గుర్తుంచుకుంటుందని ఆయన తెలిపారు.