ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Clashes_Between_YSRCP_Leaders_in_Araku

ETV Bharat / videos

Differences in Araku YSRCP: అరకులోయ వైసీపీ భగ్గుమన్న విభేదాలు.. వైవీ సుబ్బారెడ్డి ముందే..! - వైసీపీలో వర్గ విబేధాలు

By

Published : Aug 17, 2023, 1:31 PM IST

Differences in Araku YSRCP: అధికార పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమంటున్నాయి. ఎవరికి వారు తమ సత్తాను చాటే క్రమంలో ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. నువ్వేంటే.. నువ్వంటూ ఒకరిపై ఒకరు మాటలు దూసుకుంటున్నారు. ఒక వర్గానికి చెందిన నాయకులు.. తమను పట్టించుకోవడం లేదని మరో వర్గానికి చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు. పార్టీ పెద్దల ముందే గల్లాలు పట్టుకుని కొట్టుకుంటున్నారు. వారికి సర్ది చెప్పలేక పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ నియోజకవర్గ వైసీపీలో కూడా విభేదాలు భగ్గుమన్నాయి. ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఎదుట అరకు ఎమ్మెల్యే చిట్టి ఫల్గుణకు వ్యతిరేకంగా ఆ పార్టీ అసమ్మతి నాయకులు వ్యతిరేక నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఫల్గుణకు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. MLA ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను కలిసి చర్చించుకుందామని.. సమస్యను పరిష్కరిస్తానని వైవీ సుబ్బారెడ్డి అసంతృప్తి నాయకులకు హామీ ఇచ్చారు. దీంతో అక్కడ వాతావరణం కాస్తా సద్దుమణిగింది.

ABOUT THE AUTHOR

...view details