ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Dhulipalla_Narendra_Fires_on_YSRCP_Government

ETV Bharat / videos

Dhulipalla Narendra Fires on YSRCP Government: నాలుగేళ్లు పట్టించుకోకుండా.. ఎన్నికల ముందు శంకుస్థాపనలా..?: ధూళిపాళ్ల - tdp leader Dhulipalla Narendra comments

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2023, 9:21 PM IST

Dhulipalla Narendra Fires on YSRCP Government: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల్ని భ్రమల్లో ముంచి పబ్బం గడుపుకోవాలని వైసీపీ  నేతలు చూస్తున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. అసత్యాల పునాదుల మీద గోడలు కట్టే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారని.. వారి మాయమాటలు నమ్మేవారు పొన్నూరులో లేరు అన్న విషయం గుర్తిస్తే మంచిదని అన్నారు. గుంటూరు - పొన్నూరు రహదారిలోని కొమ్మమూరు కాలువ (బకింగ్ హామ్ కెనాల్) పై బ్రిడ్జి నిర్మాణం కోసం ఈనెల 20వ తేదీన పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్య శంకుస్థాపన చేశారు. దీనిపై స్పందించిన ధూళిపాళ్ల.. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే కొమ్మమూరు కాలువపై బ్రిడ్జి నిర్మాణ పనులు ఆమోదించబడ్డాయని చెప్పారు. కాలువకు రెండువైపులా గోడలు నిర్మించి వాటిపై బెయిలీ బ్రిడ్జి నిర్మించాల్సి ఉన్న తరుణంలో ఎన్నికలు రావడం ప్రభుత్వ మారడం జరిగిందని తెలిపారు. నూతనంగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులను ఆపివేయించిందని చెప్పారు. నాలుగేళ్లు పట్టించుకోకుండా.. ఎన్నికల ముందు శంకుస్థాపన చేస్తే.. ఆ బ్రిడ్జి ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పాలని నిలదీశారు. అసత్యాలతో ప్రజలను మోసం చేయలేరన్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గుర్తిస్తే మంచిదని నరేంద్ర కుమార్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే రోశయ్య అసత్యాలను నమ్మే స్థితిలో పొన్నూరు ప్రజలు లేరని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details