తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం - భక్తులకు ఇబ్బందులు - తిరుమలలో వర్షం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 7:47 PM IST
Devotees Suffering Due to Rain in Tirumala : తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఆదివారం అర్ధరాత్రి మొదలైన వర్షం ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు వర్షం, మరోవైపు చలి తీవ్రత వల్ల భక్తులు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. శ్రీవారి దర్శన అనంతరం విశ్రాంతి గదులకు తిరుగు ప్రయాణం అయ్యే భక్తులు వర్షంలో వణికిపోతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన షెడ్ల కింద తలదాచుకున్నారు.
Rains Due to Low Pressure at Various Places : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మద్రాస్, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. జనవరిలో ఉష్ణోగ్రతలు క్షీణించడం వల్ల చలి తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు తాజాగా వర్షం రాకతో గజగజ వణుకుతున్నారు. మాములు ప్రాంత ప్రజల కన్నా తీరప్రాంత వాసులకు చలి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీంతో బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు.