ఆంధ్రప్రదేశ్

andhra pradesh

devineni_uma_fires_on_ycp_government

ETV Bharat / videos

Devineni Uma Fires On YCP Government : ఇంటింటికీ... 'బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ', జనసేన 'షణ్ముఖ వ్యూహం' - గొల్లపూడి తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 30, 2023, 2:57 PM IST

Devineni Uma Fires On YCP Government : వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతోనే జగన్‌ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిందని మాజీమంత్రి దేవినేని ఉమ ధ్వజమెత్తారు. ఎన్​టీఆర్ జిల్లా గొల్లపూడి కరకట్ట ప్రాంతంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో తెలుగుదేశం, జనసేన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. 

TDP and Janasena Gollapudi Visit 2023 : బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ, జనసేన షణ్ముఖ వ్యూహాల కరపత్రాల్ని పంపిణీ చేసి ప్రజలకు పథకాల్ని వివరించారు. ఈ సందర్భంగా ఇరుపార్టీల నేతలు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఒక్క ఛాన్స్‌ అంటూ నమ్మించి జనం గొంతు కోశారని ఆరోపించారు. ప్రజల ఆశీస్సులతో రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబును 52 రోజుల నుంచి జైలులో పెట్టి కుట్రపూరిత రాజకీయం చేస్తున్నారని ఇరుపార్టీల నేతలు మండిపడ్డారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని దారుణంగా మోసం చేశారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details