Devineni Uma Fires on Jagan: డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే.. చంద్రబాబు అరెస్ట్ : దేవినేని ఉమ - చంద్రబాబు అరెస్ట్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2023, 5:18 PM IST
Devineni Uma Fires on Jagan: రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని, రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల 13 వేల 440 దొంగ ఓట్లు నమోదయ్యాయని ఎన్నికల కమిషన్ కొంతమంది ప్రజాప్రతినిధులకు ఇచ్చిన సమాచారం బయటకు వచ్చిందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. దొంగ ఓట్ల బాగోతం బయటకు రాకుండా డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కార్యక్రమం నడిపించారని విమర్శించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లండన్‌లో 10 రోజులు ఏం చేశారనే సమాచారం బయటకు రాలేదని అన్నారు.
సీఐడీ చీఫ్ అత్యుత్సాహంగా ప్రెస్ మీట్లు పెట్టి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. అంత ఉత్సాహంగా ఉంటే పోలీస్ డ్రెస్ తీసేసి వైసీపీ కండువాలు వేసుకోవాలన్నారు. మంచోడిని జైలులో పెట్టారు, పిచ్చోడు లండన్ వెళ్లి పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఎన్నితప్పుడు కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని తెలిపారు. సజ్జల డబ్బులు లెక్కపెట్టే పనిలో ఉంటే.. అతని కొడుకు పిల్ల సైకో భార్గవ్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియాలో చేస్తున్నారని మండిపడ్డారు. తద్వారా ముఖ్యమంత్రి కళ్లల్లో ఆనందం చూసేందుకే ఇదంతా చేస్తున్నారని దేవినేని ఉమా విమర్శించారు.