Deputy CM Narayanaswamy: డిప్యూటీ సీఎం తీరుపై దళిత సంఘాలు మరోసారి ఆగ్రహం.. ఎందుకో తెలుసా? - TTD Kalyana Mandapam in Penumuru
Narayanaswamy Holding The Legs Of YV Subbareddy : ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి తీరుపై మరోసారి దళిత సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నారాయణ స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కాళ్లు పట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జీడీ నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని చిత్తూరు జిల్లా పెనుమూరులో 2 కోట్ల రూపాయలతో టీటీడీ నిర్మించనున్న కళ్యాణ మండపానికి శంకుస్ధాపన చేశారు.
ఈ కార్యక్రమం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రసంగించారు. వైవీ తన ప్రసంగంలో నారాయణ స్వామిని పొగడ్తలతో ముంచెత్తారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను అనుసరిస్తూ పేద ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడు నారాయణ స్వామి అని టీటీడీ చైర్మన్ అన్నారు. దీంతో నారాయణస్వామి టీటీడీ చైర్మన్ కాళ్లు పట్టుకుని తన కృతజ్ఞతలను తెలియజేశారు. నారాయణస్వామి బహిరంగ సభలో వ్యవహరించిన తీరు స్ధానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నారాయణస్వామి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కాళ్లు పట్టుకోవడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
TAGGED:
Deputy CM Narayanaswamy