ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అద్దంకి ప్రభుత్వ భూములపై ఆక్రమణలు

ETV Bharat / videos

Illegal constructions in Addanki: వైఎస్సార్సీపీ నేత ఫోన్..! నిలిచిపోయిన అక్రమ కట్టడాల కూల్చివేత - YCP leader stopped demolition of illegal building

By

Published : Jul 12, 2023, 5:49 PM IST

Demolition Of Illegal Structures In Addanki: బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పట్టణంలో స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ కొరవడింది. నామ్ రహదారి వెంట ఖాళీ స్థలాలు కనపడితే చాలు.. ఓ సామాజిక వర్గానికి చెందిన వారు నివాస, వ్యాపార కేంద్రాలు మార్చుకుంటున్నారు. జూలై11న జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని ఉత్తర అద్దంకి వద్ద 2.13 ఎకరాల భూమిలో గల అక్రమ కట్టడాలను తొలగించేందుకు రెవెన్యూ అధికారులు ప్రొక్లైన్​తో వెళ్లారు. కాగా, నిర్మాణాలను తొలగించొద్దంటూ ఆక్రమణదారులు అడ్డుగా నిలిచి స్థానిక వైఎస్సార్సీపీ ఇంఛార్జ్​కు సమాచారం అందించారు. అలాగే ఆ సమయంలో నామ్ రహదారిపై వెళ్తున్న వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ వద్దకు వెళ్లి కూల్చివేతలు అడ్డుకోవాలని కోరారు. దీంతో సదరు నాయకుడు రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి అక్రమ కట్టడాల తొలగింపు పనులు నిలిపేయాలి ఆదేశించినట్లు సమాచారం.  ఈ విషయంపై స్థానిక అధికారులను వివరణ కోరగా... 'పైవారు ఎలా చెప్తే.. అలా నడుచుకోవాలి కదా..' అని నిట్టూరుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details