ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Demands_of_Retired_Government_Employees

ETV Bharat / videos

Demands of Retired Government Employees : పెన్షన్ పెంచండి మహాప్రభో.. రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన - Retired Government Employees demands

By

Published : Aug 15, 2023, 5:37 PM IST

Demands of Retired Government Employees : ఇపిఎఫ్-95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9000 అమలు చేయలని డిమాండ్ చేస్తూ విశాఖలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆందోళన చేపట్టింది. రోజువారీ కూలీ చేసుకునే వాడికి కూడా తమ పెన్షన్ కంటే ఎక్కువ సంపాదిస్తూ ఆనందంగా జీవిస్తున్నారని చెప్తూ.. ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొలువుల్లో పని చేసినప్పటికీ తమకు నెలకు రూ.వెయ్యి  పెన్షన్ ఇవ్వడం సమంజసం కాదని పెన్షనర్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్ లో నిరసన చేపట్టారు. వయస్సు మళ్లీన తాము... వెయ్యి రూపాయల పెన్షన్​తో ఎలా బ్రతకాలి అని ప్రశ్నించారు. ఇపియఫ్-95 పెన్షనర్లు అందరికీ నెలకు రూ.9000 పెన్షన్, ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్లకార్డులు పట్టుకుని భార్యా భర్తలకు మెడికల్ సౌకర్యం కల్పించాలని..పెన్షన్ భిక్ష కాదు- మనహక్కు.. కేంద్రప్రభుత్వం, ఇ.పి.ఎఫ్.ఒ పెన్షనర్​ల సమస్యల పట్ల మొండి వైఖరి విడనాడాలని నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details