ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సింహాచల దేవస్థాన పుష్కరణిలో మృత్యువాత పడ్డ చాపలు

ETV Bharat / videos

Fishes Death in Simhachalam Pushkarini: సింహాచలం పుష్కరిణిలో చేపలు మృత్యువాత.. భరించలేని దుర్గంధం - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

By

Published : Jun 15, 2023, 7:02 PM IST

Bad Smell in Simhachalam Pushkarini: సింహాచల దేవస్థానానికి పవిత్రమైన అప్పన్న వరాహ పుష్కరిణి నిత్యం కళకళలాడుతూ ఉండేది. కొద్దిరోజులుగా చెరువులో చేపలు చనిపోతున్నాయి. చనిపోయిన చేపలు చెరువుకి ఇరువైపులా ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయి. మూడు నాలుగు రోజులైనా దేవస్థానం అధికారులు చేపలను తొలగించకపోవడంతో దుర్వాసన వస్తోంది. భక్తులు, స్థానికులు ఈ దుర్వాసనతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే గ్రామీణ ప్రాంత భక్తులు పుష్కరిణిలో స్నానం ఆచరించి కొండపైకి వెళ్తారు. కానీ ఈ దుర్వాసన భరించలేక పుష్కరిణిలో స్నానం చేయకుండానే.. తలపై నీళ్లు చల్లుకొని స్వామి వారి దర్శనానికి వెళ్తున్నారు. పారిశుద్ద్య చర్యలు చేపట్టకపోతే వాధ్యులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం అధికారులు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చెరువులో చనిపోయిన చేపలను తొలగించి.. దుర్వాసన లేకుండా చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. సత్వరమే చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు డిమాండ్​ చేస్తున్నారు. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details