ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎమ్

ETV Bharat / videos

ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం.. సీసీ కెమెరాలో దృశ్యాలు.. - తిరుపతి జిల్లా లేటెస్ట్ న్యూస్

By

Published : Apr 3, 2023, 4:02 PM IST

Dcm Hit Rtc Bus In Thirupathi:తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై అవిలాల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు రోడ్ల కూడలి వద్ద రోడ్డు దాటుతున్న ఆర్టీసీ బస్సును ఓ డీసీఎమ్ ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. బస్సు తిరుపతి రూరల్ మండలం అడపారెడ్డిపల్లి నుంచి ప్రయాణికులతో తిరుపతికి వెళ్తున్న సమయంలో చంద్రగిరి నుంచి రేణిగుంట వైపుకు వెళ్తున్న డీసీఎం వ్యాను బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి డివైడర్​పై పడిపోయింది. స్థానికులు బస్సు అద్దాలను పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.  సీసీ ఫుటేజీ ఆధారంగా ఈ ఘటనపై ఎం.ఆర్.పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details