ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Dasara Sharan Navaratri Celebrations 2023

ETV Bharat / videos

Dasara Sharan Navaratri Celebrations 2023: ఇంద్రకీలాద్రిపై నాలుగోరోజు శరన్నవరాత్రి వేడుకలు.. శ్రీమహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 11:35 AM IST

Dasara Sharan Navaratri Celebrations 2023 :విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. కనకదుర్గమ్మవారు నాలుగో రోజు  శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తున్నారు. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మిదేవి.. జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టం అని ఆలయ పండితులు యనమండ్ర ఉమాకాంత తెలిపారు. మూడు శక్తుల్లో ఒక శక్తైన శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించిందని ఆయన తెలిపారు.  

Dussehra Celebrations in Kanaka Durga Temple :లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలకక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టిరూపమైన అమృతస్వరూపిణిగా శ్రీదుర్గమ్మ ఈ రోజు భక్తులను అనుగ్రహిస్తున్నారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం వలన భక్తులందరికీ ఐశ్వర్యప్రాప్తి, విజయము లభిస్తుంది. ఉదయం నాలుగు గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులు విశేష పూజలు, కుంకుమార్చనలు చేసేందుకు భారీగా తరలివచ్చారు. లోక స్థితికారిణిగా.. వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టిరూపమైన మహాలక్ష్మిదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారని ఆలయ పండితులు యనమండ్ర ఉమాకాంత శర్మ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details