ఘనంగా కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు - పూల చాదర్లతో కోలాహలం - కడప తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2023, 2:48 PM IST
Darga Urusu Festivel in Kadapa :ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. ఉరుసును పురస్కరించుకొని దర్గాను విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించారు. ఉత్సవాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, కలెక్టర్ విజయరామరాజు తలపై పూల చాదర్ పెట్టుకుని దర్గాకు తీసుకొచ్చి దర్గాలో సమర్పించారు. పకీర్ల విన్యాసాలతో ర్యాలీ కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Special Celebrations in andhra Pradesh : రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. దర్గా ఉరుసు అత్సవాల్లో భారీగా భక్తులు పాల్గొన్నారు. వివిధ ప్రత్యేక చాదర్లను దర్గా దగ్గరకు తీసుకురావడంతో ఈ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఉరుసు సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల దుకాణాల వద్ద మహిళలు కిక్కిరిసి ఉన్నారు. మహిళలకు నచ్చిన వివిధ హంగులతో ఉన్న గాజులు, కమ్మలు తదితర సామాగ్రిని కొనుగోలు చేశారు.పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమం జాతర మాదిరిగా కొనసాగింది.