Damaged Roads in Krishna District: రోడ్లపై గుంతలు.. ప్రయాణించాలంటే భయం భయం - కృష్ణాజిల్లా మొవ్వ మండలం
Damaged Roads in AP: కృష్ణా జిల్లా మొవ్వ మండలం.. కూచిపూడి ప్రధాన రహదారి చిన్న వర్షానికి చెరువులా మారింది. రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పాడ్డాయి. దీంతో రోడ్డెక్కాలంటేనే వాహనదారుల జంకుతున్నారు. ఉదయం గవర్నర్‌పేట డిపోకి చెందిన విజయవాడ నుంచి ఘంటసాల వెళ్లే మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు రోడ్డుపైన ఉన్న గుంతలో దిగబడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రహదారిలో ప్రయాణం చేసి క్షేమంగా సమయానికి.. కళాశాలలకు, ఆఫీసులకు, ఇళ్లకి చేరుకోగలమా అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందని అని అన్నారు. ప్రధాన రహదారుల్లోనే ఇంత పెద్ద గుంతలు ఉంటే అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, ప్రజలుకు కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేని ఈ నాయకులు ఎందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోజూ వచ్చే ఆటోలు, పాఠశాల బస్సులు, ఆర‌్టీసీ బస్సులు ఈ నకరంలో ఇంకెన్నాళ్లు తిరగాలో అని బోరుమంటున్నారు. గోతుల బాధ నుంచి విముక్తి లభించడం లేదని.. వాహనదారులు, ప్రయాణికులు వాపోతున్నారు.