దళిత కుటుంబానికి న్యాయం చేయాలి - మంత్రి మేరుగ నాగార్జునను కలిసిన 'విదసం' నేతలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2023, 3:30 PM IST
Dalit Community Leaders Fires On YCp Leaders in East Godavari :తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన బొంత మహేంద్ర మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక నేతలు, మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. ఈ విషయమై వీరంతా మంత్రి మేరుగ నాగార్జునను కలిశారు. ఆత్మహత్యకు కారణమైన నాగరాజు, సతీష్‌లను ఇంత వరకు అరెస్ట్ చేయలేదని మృతుడు బొంత మహేందర్ బంధువులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబానికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చేలా వారు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ కేసును సీబీఐకి అప్పగించి ఎస్టీ, ఎస్సీ కోర్టుకు బదిలీ చేయాలని దళత సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
United Vedika leaders of Visakha Dalit Associations on Dalith Death :బాధిత కుటుంబంవారు వైసీపీ వర్గానికి చెందిన వారైనప్పటికీ కేవలం దళితులనే కారణంగా ఈ దారుణం జరిగిందని విశాఖ దళిత సంఘం నాయకులు తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని మృతుడి కుటుంబ సభ్యులు, విశాఖ దళత సంఘాల ఐక్య వేదిక నేతలు పేర్కొన్నారు.